*అన్నీ ఉచితం ! అంతా ఉచితం !*
45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి...
45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను...
*ఇంక జీవితంలో లేదు టెన్షన్*
ఆకలేస్తే అన్న క్యాంటిన్...
రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు...
నిద్దరొస్తే సర్కారిచ్చిన ఇల్లు...
చుట్టాలొస్తే రూపాయికిలోసన్నబియ్యపువిందు...
పండగొస్తే 2 gas సిలిండర్లు,పండుగ కానుకగా ఒక సంచిలో 5 ఐటమ్స్...
అంతా బాగానే ఉన్నది !
భూతల స్వర్గం భారతదేశం...!!!
కానీ
అన్న క్యాంటిన్ లో వంట ఎవరు చేస్తారు ? ఎందుకు చేస్తారు ?
రోగానికి మందిచ్చి సేవచేయటానికి ఎవరుముందుకొస్తారు ?
ఇంటినిర్మాణానికి రాళ్ళెత్తే కూలీవస్తాడా ?
వ్యవస్థ,సమాజం ఛిన్నాభిన్నం కాదా ! అసలు మన నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ, మనలోని ఆత్మ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు...!!!
5 రూపాయల భోజనం ప్రజలు అడిగారా??
పండుగలకు బహుమతి అడిగారా??
లేదు...!!!
నాణ్యమైన జీవితం కావాలని అడిగారు.
రోడ్లు అడిగారు, కరెంటు,నీరు,విద్య , ఉద్యొగ కల్పన అడిగారు...!!!
కానీ
అవి కాకుండా ఇదేమి విచిత్రం...
అసలు మనం ఎటు పోతున్నాం...!!!
అసలు సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా ?
Is it worth living ???
ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే "సంఘర్షణ"
ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధాని పీఠం దాకా రావాలంటే "సంఘర్షణ "
తన కలలు పండించుకోవడానికి ఒక "కలామ్ " పడ్డది "సంఘర్షణ "
మనిషి ఎదగాలంటే కావాల్సింది సంఘర్షణ!
*పథకం చూడటానికి గొప్పదే*
ఇప్పటికే ప్రతి రంగం లోను పని చేసేవారు లేక కుదేలయిపోయింది !
వ్యవసాయానికి కూలీలేడు
కొట్లోకి గుమాస్తా దొరకడు !
పనికి రమ్మంటే ఒక్కడూ రాడు ! వచ్చినా సరిగా పని చేయడు...
మనిషిని పనికి పురికొల్పేది అతని ఆకలే ! ఆకలి తీర్చాలి !
కానీ ఉచితంగా కాదు ! అది తీరేమార్గం చూపించాలి...!!!
చైనా లో ఒక సామెత. ఆకలితో ఉన్నవాడికి చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పండి.
అతనికి ఎప్పుడు ఆకలేసిన, ఆకలి తీరుతుంది...!!!
అంతే గాని అన్ని ఉచితంగా ఇస్తాను. ఏమిటిది ???
*ఎవరికి ఉచితమివ్వాలి*?
పని చేసుకోలేని వారికి వృద్ధులకు,అనాధలకు అభాగ్యులకు,
వారికి చేయూతనిచ్చే వ్యవస్థ ను రూపొందించండి...!!!
అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు...!!!
పనిచేయని వాడికీ, పని చేసే వాడికీ కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తే, చివరకి పని చేసే వాడు కూడా పని చేయడం మానేస్తాడు. వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది...!!!
ఒకప్పటి రష్యా పరిస్థితి ఇంతే కదా...!!!
0 Comments
thanks for comment we will response to you soon